విశ్వ తేజోన్ ఆధ్వర్యంలో ప్రముఖ సైకాలజిస్ట్ గౌరవనీయులు శ్రీ హరి తిరునగరి గారు బేసిక్ కౌన్సిలింగ్…
1 min read
AABNEWS : విశ్వ తేజోన్ ఆధ్వర్యంలో ప్రముఖ సైకాలజిస్ట్ గౌరవనీయులు శ్రీ హరి తిరునగరి గారు బేసిక్ కౌన్సిలింగ్ యెన్ .యల్ .పి . టెక్నిక్స్ డవలప్మెంట్ వర్క్ షాప్ ను నిజామాబాదు లోని సరస్వతినగర్ సింహ క్లిట్ ఫోర్డ్ ఆఫీస్ లో నిర్వహించారు ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ కౌన్సిలింగ్ యొక్క ప్రత్యేకత తెలుపుతూ ఈవిధంగా వివరించారు ప్రతి ఒక సంస్థ అందులో పనిచేసే ఉద్యోగులు కూలీలు యాజమాన్యానికి తప్పనిసరిగా ఒక కౌన్సిలర్ ని నియమించాలి ఎందుకంటె యాజమాన్యానికి ఉద్యోగులకి ఒక సంధానకర్తగా వ్యవహరిస్తూ సంస్థను అభివృద్ధి పధంలో నడపడానికి కౌన్సిలర్ యొక్క పాత్ర తప్పనిసరి అని అన్నారు. అదే విధంగా డా. సి ఏం మధుసూదన చారి గారు మాట్లాడుతూ ప్రతి సంస్థ అనగా రాజకీయంగా గని విద్య వైద్య ఆర్గ్యం రంగాలలో ఒక కౌన్సిలర్ యొక్క పాత్ర అద్భుతమైన బాధ్యతతో కూడుకున్నది ప్రతి సంస్థలో మేనేజర్ యెంత అవసరమో అదే విధంగా కౌన్సిలర్ కూడా అని ప్రభుత్వం దినిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఒక కౌన్సిలర్ ని నియమించాలి అని దాని ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజల్లో వెళ్లడానికి ఏంటో దోహదపడుతాయని అదే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు వంతెన లాంటివాడు కౌన్సిలర్ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.



206 Total Views, 2 Views Today