వెనక్కి తగ్గినా రజిని…
1 min read
AABNEWS : ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నా. ఆరోగ్యం ప్రాధాన్యమని ఆత్మీయులు సూచించారు. ఎంతో భారమైన హృదయంతో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నా. ఇటీవల అనారోగ్య బారినపడటాన్ని దేవుడి సూచనగా భావిస్తున్నా. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటీవల 120 మంది ఉన్న మా చిత్రబృందంలో కొందరు కరోనాకు గురయ్యారు. అలాంటిది నేను ఎన్నికల బరిలోకి దిగితే లక్షల మంది జనం మధ్యలోకి వెళ్లాలి. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను సాహసం చేయలేను. ప్రజలను ఇబ్బందుల్లో పెట్టలేను. కేవలం సోషల్‌మీడియా ప్రచారంతో ఏ పార్టీ కూడా గెలవలేదు. అయితే నిజం మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా నా ప్రజాసేవ నిరంతరం సాగుతుంది.” ఇదీ.. రజనీకాంత్ తాజాగా చేసిన ప్రకటన సారాంశం. తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటుపై మరోసారి వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి పార్టీని ప్రారంభించడం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు రజనీకాంత్ మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌పై ఈ లేఖను పోస్ట్ చేశారు. 2021 తమిళనాడు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, అభిమానులు తనను క్షమించాలని కోరారు.
193 Total Views, 2 Views Today