AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైఎస్సార్ సీపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ …

1 min read

AABNEWS : గన్నవరం పంచాయతీకి టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన పాలేటి మనోఙ్ఞ తిరిగి వైఎస్సార్ సీపీలోకి మంగళవారం సాయంత్రం చేరారు.ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాలేటి రాజు ఆయన సతీమణి మనోఙ్ఞ కు వైఎస్సార్ సీపీ కండువా కప్పారు.ఈ సందర్భంగా పాలేటి రాజు మాట్లాడుతూ సర్పంచ్ గా పోటీచేసేందుకు అవకాశం రావడంతో వైఎస్సార్ సీపీ మద్దతు తనకు రాకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తమను తెలుగుదేశం పార్టీ అండగా ఉండి, గెలుపు కృషిచేస్తానని నమ్మబలకడంతో టీడీపీలో చేరడం జరిగిందన్నారు.తీరా వెళ్లిన తర్వాత టీడీపీ పార్టీ నుండి సరైన మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.ఎన్నికల కౌటింగ్ రోజు కనీసం ఏజెంట్లను కూడా పెట్టలేని పరిస్థితి ఉందన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో ఇమడలేమని గ్రహించి మళ్ళీ తల్లి లాంటి వైఎస్సార్ సీపీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనగాని రవి, తోట వెంకయ్య,పడమట నాగరాజు,మోదుగుమూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 65 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.