వైఎస్ షర్మిలను కలిసిన అప్పం కిషన్
1 min read
AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల ను వైయస్సార్ సిపి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అనేక మంది పేదలు లబ్ధి పొందారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేద ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారి ఇబ్బందులను తొలగించేందుకు రాజన్న రాజ్యం తీసుకు రావాలన్న లక్ష్యంతో వైయస్ షర్మిల రాజకీయాల్లోకి రాబోతున్నారు అని అన్నారు. తెలంగాణ ప్రాంతం లో ఓదార్పు యాత్ర నిర్వహించిన సందర్భంగా ఎంతో మంది పేదల సాధకబాధకాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి గా రాజశేఖర్ రెడ్డి తనయగా రాజన్న రాజ్యం తీసుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతోమంది వైయస్సార్ అభిమానులు ఎదురుచూసిన విధంగా వైఎస్ షర్మిల ప్రజలలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.
799 Total Views, 2 Views Today