AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ప్రెస్ మీట్

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

తెలంగాణ ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం పంపిణ లేఖను ఖండిస్తూ, గౌరవ శాసనసభ్యులు శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తన క్యాంపు కార్యాలయం నందు పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
————————————–
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…

-ఒకప్పుడు రామప్ప-పాకాల ప్రాజెక్టు లేదన్నారు, ఇప్పుడు వాటికి అనుమతులు లేవంటున్నారు.
-రైతులపై ఎలాంటి సానుభూతి లేకుండా నిలకడ లేని ప్రకటనలు చేస్తున్న నాయకులను రైతులంతా కలిసి నిలదియ్యాలి.
-ఈ నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వని, కనీసం ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేని నాయకులు అర్ధరహిత మాటలతో రైతులను తప్పుదోవ పట్టిస్తూ వారి ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.
-రైతుల పాలిట శాపంగా మారిన నూతన వ్యవసాయ చట్టాలపై, ప్రాజెక్టులు నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నోరు మెదపని మీరు ఈ ప్రాంత ప్రజల భవిష్యత్ కు సమాధానం చెప్పాలి.
-మా పోరాటం కేవలం రైతుల పక్షమే, పార్టీలకతీతంగా రైతు అభివృద్ధికి ఆట0కం కలిగించే వారు మాకు ఎప్పటికి శత్రువులే.
-నూతన ప్రాజెక్టుల ద్వారా ప్రతి చివరి ఎకరానికి నీరందించడమే
మాలక్ష్యం. పాకాల స్థిరీకరణ పెంచడం, SRSP DBM- 38,40,48 ల కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీరందించి గొలుసు కట్టు చెరువులు నింపడం, నర్సంపేట నియోజకవర్గ రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా మేము చేసే కృషి ప్రయత్నాన్నీ అడ్డుకోవాలని చూస్తే
భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
-రీ-డిజైనింగ్ లో భాగంగా నిర్మించుకున్న వరంగల్ రూరల్ జిల్లా ఇరిగేషన్ సర్క్యూట్ ను ఎలాంటి అడ్డంకులు లేకుండా సద్వినియోగ పరుచుకోవాలి. దాని కొరకు మనం చేసిన కృషి ఎనలేనిది.
-ఈ ప్రాజెక్టుల ద్వారా రైతుల భూములకు అధిక ధర పలికింది, కేంద్ర ప్రభుత్వం సృస్టించే అడ్డంకులతో మళ్ళీ
పడిపోయే అవకాశం ఉంది.
-ఈ ప్రాంత ప్రజల భవిష్యత్ ను నిర్ధేశించే సాగునీటి ప్రాజెక్టులను నిలిపి వేసి వారిని ఆర్థికంగా దెబ్బతీయాలనే చర్య దుర్మార్గం.
-ఏ ఎన్నికల ఎత్తు గడలతో ఎలాంటి రాజకీయ లబ్ది కొరకు ఈ చర్యలకు పూనుకొన్నారో ప్రజలకు తెలియజేయాలి.
-పుట్టిన ప్రాంత0 కొరకు గెలిపించిన ప్రజల కొరకు పోరాడని వాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు.
-నియోజకవర్గ0లోని రెండు లక్షల మందితో పోస్టు కార్డుల ద్వారా నిరసన తెలిపే శాంతియుత “ఉత్తర ఉద్యమం” ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది.
-వెంటనే కేంద్ర ప్రభుత్వం స్ప0దించి ప్రాజెక్టుజలపై ఆంక్షలను ఎత్తివేయ్యాలి లేని పక్షంలో
నిరసనలను తీవ్రతరం చేస్తాం.
-ప్రాజెక్టులను అడ్డుకోవాలని పంపిన లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన జిల్లా కెలెక్టరేట్ వద్ద ఒక్కరోజు శాంతియుత ధర్నా చేస్తా0.
-ఈ ధర్నాలో పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొంటారు.

 599 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.