శ్రీ మల్లికార్జున స్వామి నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి…
1 min read
AABNEWS : ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మునిగాల సమ్మయ్య గౌడ్ చైర్మన్ గా ఎన్నికైన నూతన ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి నూతన పాలక వర్గం కృషి చేయాలనీ సూచించారు. అలాగే స్వామి వారి బ్రహ్మోత్సవాల జాతరను ఘనంగా నిర్వహించడంతో పాటు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు, ఎంపిపి మర్నేని మధుమతి, జడ్పి వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, వైస్ ఎంపిపి తంపుల మోహన్, జడ్పి కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్ అలీ, రైతు బందు సమితి కో ఆర్డినేటర్ మజ్జిగ జైపాల్, మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మిద్దెపాక రవీందర్, ఆలయ ఈవో, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

383 Total Views, 2 Views Today