AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

షా బుఖారి బాబా దర్గానును దర్శించుకున్న తెదేపా నేత జంపాల సీతారామయ్య కొండపల్లి…

1 min read

AABNEWS : షా బుఖారి బాబా దర్గానును దర్శించుకున్న తెదేపా నేత జంపాల సీతారామయ్య కొండపల్లి బీ కాలనీ సమీపంలోని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గాను 424 ఉరుసు మహోత్సవ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు జంపాల సీతారామయ్య మంగళవారం రాత్రి దర్శించుకున్నారు.
ముస్లిం మత పెద్దలతో కలిసి దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన షా బుఖారి బాబాను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాబా ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఉరుసు ఉత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న దర్గాలో బాబాను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోర్కెలు తప్పకుండా తీరుస్తారని చెప్పారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

 82 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.