AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

షూటింగు దశలోమాస్ట్రో…

1 min read

AAB NEWS : కథా చిత్రాలను ఈ తరం కుర్రాళ్లకు నచ్చేలా తెరకెక్కించడంలో వెంకీ కుడుముల తన సత్తా చాటుకున్నాడు. ‘ఛలో’ … ‘భీష్మ’ సినిమాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో యూత్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసిన సినిమాగా ‘భీష్మ’ నిలిచింది. అక్కడక్కడా ఎమోషన్ ను టచ్ చేస్తూ సరదాగా సాగిపోయిన ఈ సినిమా, నితిన్ కెరియర్లోనే భారీ వసూళ్లను రాబట్టింది. అందువలన అదే దర్శకుడితో మరో సినిమా చేయడానికి నితిన్ నిర్ణయించుకున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.నిజానికి ‘భీష్మ’ తరువాత వెంకీ కుడుముల ఒకటి రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టే ప్రయత్నాలు చేశాడు కానీ సెట్ కాలేదు. ఈ సమయంలోనే నితిన్ ‘చెక్’ .. ‘రంగ్ దే’ సినిమాలు చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు ఆయన అభిమానులను నిరాశపరిచాయి. ప్రస్తుతం ‘మాస్ట్రో’ చేస్తున్న నితిన్ కి వెంకీ కుడుముల కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ ఏడాది చివరినాటికి షూటింగును పూర్తిచేయాలని అనుకుంటున్నారట. ఇక కథానాయికగా రష్మికను సెట్ చేసే అవకాశాలు ఎక్కువని చెప్పుకుంటున్నారు.

 465 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.