అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించని వైనం బీడు గా మారిన 185 ఎకరాలు…
1 min read
AABNEWS :
భూమిని కొన్నారు…. రైతుల భూములను బీడుగా మార్చారుచెరువులకు నీరు రాకుండా అధికారులపై ఎమ్మెల్యే తమ్ముడి ఒత్తిడి అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించని వైనం బీడు గా మారిన 185 ఎకరాలు
సంగారెడ్డి ఆదాబ్ హైదరాబాద్: ఇంతకాలం స్థానికేతరులు ప్రాతినిధ్యం వహించడం వల్ల తమ ప్రాంతం అభివృద్ధి చెందలేదు అనే అభిప్రాయాన్ని ఇప్పటి వరకు వ్యక్తం చేసేవారు. కానీ స్థానిక అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందితే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అనుకున్నారు… కానీ ప్రాంతం కంటే సొంత లాభాలను ఆర్జించి సంపాదన పైన దృష్టి పెట్టడం పట్ల చన్న చిన్నకారు రైతులు కూలీలుగా మారిపోయారు. ఇందుకు ప్రస్తుత ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సొంత తమ్ముడు రాహుల్ కిరణ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెరువులోని ఎఫ్ టి ఎల్ భూమిని కొనుగోలు చేశాడు. ఈ చెరువులోకి నీరు వస్తే తాను కొనుగోలు చేసిన భూమి మునిగిపోతుందని, అందుకు చెరువులోకి సింగూర్ వరద కాలువ ద్వారా వచ్చే నీటిని వదలకుండా ఇరిగేషన్ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా స్థానిక రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే తమ్ముడు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం తోనే చెరువులకు నీరు వదలడం లేదని రైతులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అందోల్ మండలంలోని అందోల్ గ్రామ శివారులో గల
912.910.911.913.915.916 సర్వే నెంబర్లలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ కిరణ్ ఎఫ్ టి ఎల్ లోని భూమిని కొన్నారు. తిరుమల చెరువు పూర్తి విస్తీర్ణం 49 ఎకరాలు. ఇందులో ఎఫ్ టి ఎల్ 17 ఎకరాల ఆల్ మై పేట శివారు, 12 ఎకరాలు అందోల్ శివారులోని ఎఫ్ టి ఎల్ భూమి. ఈ చెరువు కింద 185 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రధానంగా సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. అందరూ గ్రామంలోని 60 మంది వివిధ సామాజిక వర్గాలకు చెందిన రైతులకు ఈ చెరువు కింద ఎక్కడ రెండు వేల వరకు భూమి ఉంది. 2013లో సింగూర్ కాలువల ద్వారా ఈ చెరువు నింపడంతో ఆయకట్టు రైతులు రెండు పంటలను సాగు చేశారు. 2015లో ప్రస్తుత ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సోదరుడు రాహుల్ కిరణ్ 12 ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో ఆయకట్టు కింద భూమి బీడుగా మారింది. దీనికి ప్రధాన కారణం సింగూర్ కాలువ ద్వారా తిరుమల చెరువులోకి నీటిని తరలిస్తే తమ భూమి మునిగి పోతుంది అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖ అధికారుల పై ఒత్తిడి తీసుకువచ్చి నీటిని చెరువులోకి వదలకుండా అడ్డుకున్నారు. ఆయకట్టు కింద రైతులు ఎకరాకు ఐదు వందలు చొప్పున సొంత డబ్బులు వసూలు చేసుకుని సింగూర్ ప్రధాన కాలువ నుంచి తిరుమలయ్య చెరువు వరకు కాలువలు తవ్విన ఎమ్మెల్యే అనుచరులు కాలువలను పూర్తి వేయించారు. దీనిపై గత నవంబర్ నుంచి జిల్లా కలెక్టర్ తో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు చుట్టూ తిరుగుతున్న తిరుమల చెరువును సింగూరు నీటి తో నింపే లేక పోతున్నారూ. ఎమ్మెల్యే అడ్డుకున్నాడు: రైతు శ్రీనివాస్ రైతులను పట్టించుకోవడం లేదు: రైతులు సంగప్ప తిరుమల చెరువులోకి సింగూరు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏడాదిగా తిరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రైతుల మధ్య చిచ్చుపెట్టి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే తమ్ముడు భూమి కొన్న అప్పటినుండి చెరువులోకి నీరు రాకుండా పై ఒత్తిడి తీసుకొస్తున్న ఎవరు అడిగేవారు లేరు. దీంతో రైతులను కూలీలుగా మారి పోయాం. మిషన్ కాకతీయ కింద 18 లక్షలతో తూము ను కట్టిన నీళ్లు నిల్వ ఉండేలా అవసరమైన గేటును పెట్టకపోవడంతో వర్షాకాలంలో వచ్చిన నీరంతా కిందకు వృధాగా పోయింది. ఇప్పుడు సింగూర్ నీరు తీసుకు వస్తే తూముకుంట గేట్ పెట్టకపోవడంతో నీళ్లు వృధాగా పోయే అవకాశం ఉంది.
1,343 Total Views, 2 Views Today