సమస్యలు పరిష్కరించని అడిగితే అరెస్టులు చేస్తారా…
1 min read
AABNEWS : బాధలు చెప్పుకోవడానికి వెళ్లిన వారిపై జులుం ప్రదర్శించిన పోలీసులు నర్సింగ్ అధికారుల అరెస్టులను APNSS-APNSF కండిస్తుంది. నర్సింగ్ అధికారుల సమస్యలు పరిష్కారం చూపకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమం కి సిద్దం ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలకు దూరం గా ఉంటూ కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడిన నర్సింగ్ అధికారులు తమ న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ ని కలవడానికి ప్రయత్నం చేస్తే స్థానిక పోలీసులు మహిళలు అని కూడా చూడకుండా వారిని ఇష్టానుసారంగా లాగివెయ్యడం , నర్సింగ్ అధికారుల పై కేస్ లు నమోదు చెయ్యడాన్ని కండిస్తుంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ మొదటి వరుస సైనికులు నర్సింగ్ అధికారులు చెప్తున్న కింది స్థాయి అధికారులు మాత్రం నర్సింగ్ అధికారుల పట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారన్నారు. పాడేరు లో నర్సింగ్ అధికారుల సమస్యలను చెప్పుకోవడానికి జిల్లా మంత్రి దగ్గరకి వెళ్లాలని ప్రయత్నం చేసినా వారి పై పోలీస్ లు దౌర్జన్యం చెయ్యడం దారుణం . కోవిడ్ విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ అధికారుల పట్ల వివక్ష చూపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టే విధంగా నిర్ణయం తీసుకుంటాం.స్వచ్ఛంద ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడు

619 Total Views, 2 Views Today