AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సమాజ సేవ చేయడమే ఇంటర్నేషనల్ వాకర్స్ లక్ష్యమని…

1 min read

AABNEWS : సమాజ సేవ చేయడమే ఇంటర్నేషనల్ వాకర్స్ లక్ష్యమని ఇంటర్నేషనల్ వాకర్స్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి అన్నారు .ఆదివారం స్థానిక గాంధీ బొమ్మ వద్ద గౌతమబుద్ధచ వాకర్స్ అసోసియేషన్ నిర్వహించిన మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటుందని ప్రకృతి విలయాలు సంభవించినపుడు ప్రజలకు అండగా ఉంటుందన్నారు .గౌతమబుద్ధ వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవరాయప్ప మాట్లాడుతూ తమ సంస్థ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తోందని కరోనా సమయంలో కూడా పేదలకు వాకర్స్ కు అండగా నిలిచిందన్నారు . చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. వాకర్స్కు ఉచితంగా షుగర్ ఒబేసిటీ బేబీ లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు . గౌతమబుద్ధ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయప్రకాశ్ కార్యదర్శి ప్రధానకార్యదర్శి రాయప్ప అతిథులను ఘనంగా సన్మానించారు ..ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి బలరామ్నాయుడు రాఘవేంద్ర శెట్టి ఏ .రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు పెద్దయెత్తున వాకర్సు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు

 562 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.