AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సావిత్రి భాయ్ పూలే జయంతి వేడుకలు

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

సావిత్రి భాయ్ పూలే జయంతి వేడుక సందర్బంగా బుర్ర కాంప్లెక్స్ నందు సావిత్రి భాయ్ పూలే గారికి పూల మాల వేసి 190 వ జయంతి వేడుకను RTI జయశంకర్ జిల్లా అధ్యక్షుడు బుర్ర కిరణ్ కుమార్ గారు జరిపారు వారు మాట్లాడుతూ
సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే జయంతి నేడు. ఈమె జయంతి ‘జాతీయ మహిళా’ ఉపాధ్యాయ దినోత్సవంగా
జరుపబడుతుంది.ఈమె గొప్ప సంఘసంస్కర్త. హరిజన విద్యకు కృషి చేసిన జ్యోతిరావు పూలే యొక్క సతిమణి. భర్తనే ఆదర్శంగా తీసుకొని మహిళలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు కల్పించడానికి కృషి చేశారు.పూనాలో తన భర్త స్త్రీల కోసం ప్రత్యేక
పాఠశాలను ప్రారంభించడంలో ఈమె కృషి ఎంతో గొప్పది.
ఈమె కృషి కేవలం స్త్రీ విద్యకే పరిమతం కాలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు సేవ చేసిన గొప్ప మహిళ. భయంకరమైన ప్లేగు వ్యాధితో బాధపడుతున్న వారికి సేవ చేస్తూనే మరణించింది.
సావిత్రిబాయి పూలే జీవితం సమాజసేవలో ప్రతీ ఒక్కరి బాధ్యతను గుర్తు చేసే ఆదర్శం.. అని అన్నారు ఈ కార్యక్రమంలో కెసీఆర్ సేవ దళం అధ్యక్షుడు వడ్లకొండ రమేష్ గౌడ్,
TPTF జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కె.నదీమోద్దీన్,రాహుల్,శ్రీకాంత్, రవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు

 272 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.