AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది…

1 min read

AAB NEWS :

సిద్దిపేట : వానకాలంలో మొక్కజొన్న పంట సాగు చేసి వ్యవసాయ అధికారుల వద్ద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోనటువంటి మొక్కజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు అనుమతి మంజూరైందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారివే మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నారనే విషయం రైతులు తన దృష్టికి తీసుకవచ్చారని తెలిపారు.మొక్కజొన్న పంటలు ఆన్‌లైన్‌లో నమోదు కానీ వారి వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి నమోదు చేయాలని ఆదేశించామన్నారు. ఈ మేరకు జిల్లాలో 1146 మంది రైతులకు సంబంధించిన 2,375 ఎకరాల్లో పండిన పంటను ప్రభుత్వం రూ.1850 కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. దీనికి అనుగుణంగా ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్లలో మార్క్‌ఫెడ్‌ అధికారులు సమన్వయం చేసుకొని వీలైనంత త్వరగా రైతుల వద్ద నుంచి మొక్కజొన్నలను కొనుగోలు చేయాలన్నారు.

 240 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.