AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సుధీర్ బాబు నుంచి మరో చిత్రం…

1 min read

AAB NEWS:సుధీర్ బాబు కథానాయకుడిగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా రూపొందుతోంది. విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి, కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయికగా ‘ఆనంది’ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆనంది’ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. అందువలన పల్లెటూరి అమ్మాయిగానే ఈ సినిమాలో ఆనంది కనిపించనుంది. టైటిల్ కి తగినట్టుగానే ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఆనంది లుక్ వదిలారు. ఈ ఫస్టులుక్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తూ అలరిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నరేశ్ .. అజయ్ .. రఘుబాబు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.’ఈ రోజుల్లో’ .. ‘బస్టాప్’ వంటి సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఆనంది, ఆ తరువాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ బిజీ అయింది. జీవీ ప్రకాశ్ కుమార్ తో అక్కడ ఎక్కువ సినిమాలు చేసింది. ‘జాంబి రెడ్డి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆనంది, ఈ సినిమాతో మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.

 129 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.