AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ లోని శ్రీ సుబ్రమణ్య స్వామి దేవాలయం లో ప్రతిష్ట…

1 min read

ABNEWS : మే 5న నాగ సర్ప గణపతి విగ్రహ ప్రతిష్టతెలంగాణ,ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటిదిమానవ జాతి దోషాలు
పొగట్టడానికేసూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ లోని శ్రీ సుబ్రమణ్య స్వామి దేవాలయం లో ప్రతిష్టదేవాలయ వ్యస్థాపక అధ్యక్షులు ముళ్ల పూడి దుర్గాప్రసాద్ రావు శర్మ వెల్లడిదేవాలయ ప్రాంగణం లో కమిటీ సభ్యులతో కలిసి కరపత్రం ఆవిష్కరణమానవజాతికి దోషాలు పోగొట్టడానికి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ లోని షణ్ముఖ పీఠం శ్రీ శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మే 5వ తారీఖు నుండి ఆరో తారీకు వరకు శ్రీ శ్రీ నాగ సర్ప గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు ముళ్ళ పూడి ప్రసాద్ రావు శర్మ తెలిపారు.మంగళవారం ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి విగ్రహ ప్రతిష్ట కు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ఏ ఒక్కరి ఇంట్లో సుఖ శాంతులు లేవని,పలు దోషాలతో మానవాళి సతమతమవుతున్నదని వీటి నివారణకు నాగ సర్ప గణపతి విగ్రహాన్ని కి పూజలు చేస్తే ఫలితం ఉంటుందని అన్నారు.అందులో భాగంగానే మొట్ట మొదటి సారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ లేని నాగ సర్ప గణపతి విగ్రహాన్ని సూర్యాపేట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో వేద పండితులతో ప్రతిష్ఠించ నున్నట్లు తెలిపారు.నాగ సర్ప గణపతి ని పూజించడం వలన గ్రహ,గృహ,సర్ప,నాగ,కుజ,అంగారక దోషాలనుండి విముక్తి పొంది చక్కని జీవితాన్ని పొందవొచ్చని తెలిపారు.
అందులో భాగం గా మే ఐదో తారీకు ఉదయం నుండి ఆలయంలో గోపూజ ,గణపతి పూజ, స్వస్తి వాచనం ,అంకురారోపణ, దేవత ఆహ్వానం, అఖండ దీపారాధన, యాగశాల ప్రవేశం, మాతృక, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ సహిత, నాగదేవత సహిత గణపతి, మంటప షోడన ఉపచార పూజలతో పాటు హోమం ,వేదపారాయణం తీర్థప్రసాదాలు వినియోగం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తిరిగి ఆరో తేదీన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు కరోన నిబంధనలు పాటిస్తూ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సీతా రవిందర్,కార్యదర్శి అన0తుల కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు పగిళ్ల శ్రీనివాస్, ఉప కార్యదర్శి గవ్వ ప్రమోద్ రెడ్డి సభ్యులు కోన మల్లయ్య,మాశెట్టి నరేష్ ,కిషోర్ కుమార్ ,వినోద్ కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి ముత్యం రాజు స్వాతి, అన0తుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 464 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.