AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సూసైడ్ నోట్ రాసి పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

1 min read

AABNEWS : సంగారెడ్డి జిల్లా అందోల్ కాన్సెన్సీ రిపోర్టర్ ఉత్తమ కార్యదర్శికి… తప్పని వేధింపులు ఇంచార్జ్ సర్పంచ్ వేధింపులతో ఆత్మహత్య సూసైడ్‌ నోట్ లో ఆవేదన జోగిపేట విధినిర్వహణలో తన పనికి తానే సాటిగా అందరి మన్ననలను పొంది చివరికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నప్పటికీ కానీ విధులు నిర్వహిస్తున్న గ్రామంలో మాత్రం ఇన్చార్జి సర్పంచ్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. పుల్కల్ మండలం మిన్ పూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి జగన్నాథం కొంతకాలంగా గ్రామంలో లో దుస్తులు నిర్వహిస్తుండగా ఇన్చార్జి సర్పంచ్ లేనిపోని ఆరోపణలు చేస్తూ కార్యదర్శికి మనస్థాపానికి గురి చేసేవాడని ఆయన తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నా చావును మన సమస్యలలో ఏదైనా ఒక సమస్యనైనా పరిష్కరించడానికి వాడుకోవాలని, నా చావుకు ప్రధాన కారణం ‘ నా ఉద్యోగమే’ అని బాధ్యతల నిర్వాహణలో ఎదుర్కొన్న అవమానాలు, ఒత్తిడిలే కారణమని పేర్కొంటూ ఎం.జగన్నాథ్‌ సూసైడ్‌ నోట్‌ వ్రాసారు. బుధవారం ఆయన స్వగ్రామమైన ఇసోజిపేటలోని తన ఇంట్లోని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ నాయకులు కొందరు కొంత మందికి మద్యం తాగించి నాతో గొడవకు ఉసిగొల్పడం ప్రతి రోజు జరుగుతుందని, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నావల్ల కావడంలేదని పేర్కొన్నారు. గ్రామ ఇంచార్జి సర్పంచ్, గ్రామ 7వ వార్డు సభ్యుడు నాకు సహకరించలేదని, చాలా ఇబ్బంది పెట్టారని నోట్‌లో వ్రాసారు. మార్చి 3 వతేదిన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ లేఖ ఇచ్చాను, కానీ ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గర అమ్మానాన్నలకు బాధ అవుతుందని భావించి మా తమ్ముడు మిస్‌ అయ్యాడని వాడిని వెతకాలని అబద్దం చెప్పాను స్నేహితులు … అమ్మా, నాన్న నేను మీరు క్షమించరానంత తప్పు చేస్తున్నా…పెద్ద మనస్సు చేసుకొని క్షమించండి తమ్ముడితో మాట్లాడి చాలా రోజులైంది…ఒరే అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోరా అని లేఖలో పేర్కొన్నారు. ఫ్రిబ్రవరి 22 నుంచి 27వ తేది వరకు పనిచేయించిన పనులకు ఈజీఎస్‌ పేమెంట్‌లు ఇప్పిటికి టీఏలు చేయలేరు, ఏపీఓ నన్ను కుక్కలా తిప్పుకున్నాడు, కాని పేమెంట్‌ చేయలేదు. నర్సరీ పనులకు, బ్యాగ్‌ ఫిల్లింగ్, పోల్స్‌ ఫిట్టింగ్, నర్సరీలోని లేబర్‌లకు,ఆడిటింగ్‌లకు నా స్వంత డబ్బులు ఖర్చు పెట్టాను. బ్రతకడం నావల్ల కావడంలేదని లేఖ రాశాడు.

 873 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.