AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు…

1 min read

AABNEWS : కేంద్రంలో మనువాద మతోన్మాద బిజెపి మోడి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆలిండియా రైతు, కార్మిక, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మే 26 జరుగు బ్లాక్ డే లో మన రాష్ట్రంలో జిల్లాలో ఉన్న రైతులు కార్మికులు పాల్గొనాలని బ్లాక్ డేకి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలుపుతుంది అని సిఐటియు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు . రాష్ట్రంలోని దళిత, గిరిజన బహుజన మైనారిటీ ప్రజా సంఘాలు మద్దతు పలకాలని కోరుతున్నాము. దేశంలో మనువాద మతోన్మాద బిజెపి మోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై దుర్మార్గమైన భారాలు మోపుతుంది. కార్మిక చట్టాలు యాజమాన్యాలకు అనుకూలంగా మార్చింది. వ్యవసాయాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేందుకు దుర్మార్గమైన మూడు నల్ల చట్టాలను తెచ్చారు. వీటిని వ్యతిరేకిస్తూ రైతన్నలు నెలల తరబడి ఆరు నెలల నుండి ఆందోళన చేస్తున్న రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చెయ్యక పోవడం బాధాకరం. కరోనా మహమ్మారి వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా చితికిపోతున్న ఈ దుర్మార్గ మనువాద మతోన్మాద బిజెపి మోడి ప్రభుత్వం కనీసం ఆదుకునేందుకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చెయ్యక పోవడం సిగ్గు చేటు అన్నారు. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకంగా రైతు, కార్మిక ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో మే 26 న జరిగే బ్లాక్ డే లో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు విద్యార్థులు యువకులు దళిత, గిరిజన, బలహీన, మైనారిటీ ప్రజా సంఘాలు నాయకులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నిర్వహిస్తున్న దీక్షాశిబిరాన్ని దగ్ధం చేసిన దుండగలను గుర్తించి కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది ఇలాంటి చర్యలు సరైంది కాదని వెంటనే సమగ్రంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్ చెన్నయ్య సిఐటియు మండల కన్వీనర్ గంగాపూర్ సుధాకర్ ర్ ఓబులవారిపల్లె మండల కన్వీనర్ ఆళ్ల సుధాకర్ పుల్లంపేట మండల కన్వీనర్ దార్ల నాగేశ్వరరావు డివైఎఫ్ఐ మండల కన్వీనర్ కర్ర తోటి హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు

 40 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.