AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సేవ మాటున.. పచ్చి మోసం

1 min read

AAB NEWS:బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో

చారిటీ ట్రస్ట్‌ ముసుగులో కరోనా కిట్లు పంపిస్తున్నామని నమ్మించిన నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్లు.. నగరవాసికి రూ.24 లక్షలు టోకరా వేశారు. ఫేస్‌బుక్‌లో కెనడాలోని చారిటీ సభ్యులమంటూ పరిచయమై.. అతడిని నమ్మిస్తూ నిండా ముంచారు. ఈ కేసులో నైజీరియన్‌ సైబర్‌ నేరగాడిని సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. బెంగళూర్‌లో కూడా సైబర్‌ మోసాలకు పాల్పడటంతో అక్కడి పోలీసులు ప్రధాన నిందితుడైన నైజీరియాకు చెందిన బెంజిమెన్‌ను అరెస్ట్‌ చేశా రు. దీంతో నగర పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై మంగళవారం నగరానికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం…

బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది ఆగస్టులో ఫేస్‌బుక్‌లో కెనడా నుంచి చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తి ( నైజీరియన్‌ సైబర్‌ నేరగాడు) పరిచయమయ్యాడు. కొన్నాళ్లు ఇద్దరు ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోవిడ్‌ నేపథ్యంలో ట్రస్ట్‌ తరపున మాస్క్‌లు, ఇతర సామగ్రితో పాటు విలువైన బహుమతులు, ఆర్థిక సహాయం కింద డబ్బులు బహుమతిగా పంపిస్తున్నామని, వాటి విలువ కోట్లలో ఉంటుందని, వాటిని తీసుకొని మీ వద్ద పంచాలని నమ్మించాడు. ఆ తరువాత రెండు రోజుల కు ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారుల మంటూ ఫోన్‌ చేసి.. మీ పేరుపై భారీ పార్శిల్స్‌ కెనడా నుంచి వచ్చాయని, అందులో మాస్క్‌ లు, శానిటైజర్లు, కరోనా కిట్లతో పాటు భారీ ఎత్తున డాలర్లు ఉన్నాయని, వాటికి క్లియెరెన్స్‌ లేదని చెప్పారు. కస్టమ్స్‌ ఫీజు, ఇతరాత్ర ఫీజులు చెల్లించాలంటూ నమ్మిస్తూ దఫ దఫాలుగా నగరవాసి నుంచి రూ. 24 లక్షలు లాగేశారు. మోసపోయానని గమనించిన బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాధితుడు డబ్బులు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాలు ఆరా తీయగా… అవి బెంగళూర్‌ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి అయిన అశోక్‌కు చెందినవిగా గుర్తించి.. గత నెలలో అతడిని అరెస్ట్‌ చేశారు. ఇతడి ఖాతాలో రూ. 46 లక్షలు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డిపాజిట్‌ అయ్యాయని గుర్తించారు. విచారణలో తనకు ఈశాన్య రాష్ర్టాలకు చెందిన ఓ మహిళ పరిచయం అయ్యిందని, ఆమెకు కమీషన్‌ పద్ధతిలో రెండు బ్యాంకు ఖాతాలిచ్చానంటూ ఒప్పుకున్నాడు. దీంతో ప్రధాన సూత్రధారి నైజిరియన్‌ కోసం గాలిస్తుండగా.. బెంగుళూర్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

నైజీరియాకు చెందిన బెంజ్‌మెన్‌ మూడేండ్ల క్రితం బిజినెస్‌ వీసాపై ఇండియాకు వచ్చి సైబర్‌నేరాలకు పాల్పడుతున్నాడు. ఇతడికి ఈశాన్య రాష్ర్టాలకు చెందిన కొందరు యువతుల సహకారం ఉం ది. ఈశాన్య రాష్ర్టానికి చెందిన ఓ యువతిని బెంజ్‌మెన్‌ పెండ్లి చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయాలు చేసుకోవడం, చారిటీల పేరు తో అమాయకులను మోసం చేస్తూ లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఇతడిపై నగరంలో ఒక కేసు, బెంగళూర్‌లో రెండు కేసులున్నాయి. ఇదిలాఉండగా.. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు.

 210 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.