స్కోప్ సమావేశానికి ఉపాధ్యాయ దంపతులు
1 min read
AABNEWS వరంగల్ ప్రతినిధి గైని ప్రవీణ్ కుమార్
వరంగల్ అర్బన్ జిల్లా నయీమ్ నగర్: కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నడుస్తున్న “విజ్ఞాన్ ప్రసార్” సంస్థ ఏప్రిల్ 8న గురువారం నాడు ఐ ఐ సి టి. హైదరాబాదులో ఏర్పాటు చేసిన “సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్” ( SCOPE)’స్కోప్’ సమావేశానికి హాజరు కావడానికి హన్మకొండలోని ఆదర్శ కాలనీలో నివసిస్తున్న సైన్స్ ఉపాధ్యాయ దంపతులు పరికిపండ్ల వేణు కలాం సైన్స్ క్లబ్ కన్వీనర్, వెలుదండి సుమలత కల్పనా చావ్లా సైన్స్ క్లబ్ కన్వీనర్ లకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజ్ఞాన్ ప్రసార్ సంస్థ వారు ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, దేశంలోని మారుమూల ప్రాంతాలకు శాస్త్రీయ భావజాలాన్ని చేరవేయడానికి ‘స్కోప్’ పథకం ద్వారా ప్రాంతీయ భాషలయిన తమిళం, కన్నడం, గుజరాతి, మరాఠీ భాషల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం మన తెలంగాణలో తెలుగు భాష ద్వారా ప్రజలలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికి చేపట్టవలసిన కార్యక్రమాల రూపకల్పనకుగాను రాష్ట్రంలోని సైన్స్ అకాడమీలు, సైన్స్ రచయితలు, సైన్స్ అడ్మినిస్ట్రేటర్స్, సైన్స్ జర్న లిస్టులు, సైన్స్ క్లబ్ కన్వీనర్ లతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారన్నారు.ఈ మేరకు తెలంగాణ లోని ఆరు సైన్స్ క్లబ్ ల కన్వీనర్ లకు ఆహ్వానం అందిందన్నారు. వేణు సుమలతలు గత 20 సంవత్సరాలుగా విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించడానికిగాను వారు పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులచే సైన్స్ క్లబ్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా సైన్స్ ను ప్రచారం చేస్తున్నారు. సుమలత రాసిన అనేక సైన్స్ నాటికలు విజ్ఞాన్ ప్రసార్, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అయ్యాయి.
848 Total Views, 4 Views Today