AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు: తలసాని…

1 min read

AAB NEWS : హైదరాబాద్: జంట నగరాల పరిధిలోని అర్హులైన పేదలకు వచ్చే వారం నుండి నూతన రేషన్ కార్డ్ ల పంపిణీ చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో రేషన్ కార్డ్ ల పంపిణీ పై హోం మంత్రి మహమూద్ అలీ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ శ్వేతా మహంతి, చీఫ్ రేషనింగ్ అధికారి బాల మాయాదేవి, హైదరాబాదు జిల్లా సివిల్ సప్లై అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాదు జిల్లా పరిధిలో 1.77 లక్షల దరఖాస్తులు రాగా, 44,734 కార్డుల పంపిణీ జరిగిందని అధికారులు వివరించారు.

మరో 5,353 కార్డ్ లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మరో 99,014 దరఖాస్తులను పరిశీలన చేయాల్సి ఉందన్నారు.మొత్తం 670 రేషన్ షాప్ లకు గాను 613 షాప్ లు పని చేస్తున్నాయని అన్నారు.రేషన్ డీలర్లు మరణించిన కారణంగా 25 షాప్ లు పని చేయడం లేదు. త్వరలో వారి కుటుంబ సభ్యులతో సంప్రదించి షాప్ లు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.త్వరలో మరో 32 నూతన షాప్ ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాదు జిల్లా పరిధిలో ఉన్న 5,80,584 రేషన్ కార్డ్ లకు గాను ఒక్కొక్కరికి 15 కిలోలు చొప్పున ఉచితంగా పంపిణీ కోసం 33 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరు చేయడం జరిగిందన్నారు.

 162 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.