ఇన్స్పెక్టర్ను కాలితో తన్నిన మహిళా…
1 min read
AAB NEWS : హైదరాబాద్: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ మహిళ మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై వీరంగం వేసింది. నోటికొచ్చిన బూతులు తిట్టడమేగాక, ఇన్స్పెక్టర్ను కాలితో తన్నింది. కొట్టడానికి చెయ్యెత్తింది. అయితే మహిళ కావడంతో పోలీసులు ఈ తతంగాన్నంతా వీడియో తీశారు. అనంతరం సదరు మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామిని (28) అనే మహిళ గత శనివారం రాత్రి శేషు ప్రసాద్ (27) అనే స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డగించారు. కారు నడుపుతున్న శేషు ప్రసాద్‌ను బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దాంతో కారును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా కామిని వారితో వాగ్వాదానికి దిగింది. మద్యం మత్తులో బూతు పురాణం అందుకుంది. దాడి చేసింది. దాంతో పోలీసులు ఆమెపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 294 (బి), 353, 323 కింద కేసులు నమోదు చేశారు.
26 Total Views, 4 Views Today