AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎంతో కష్టించి పంట పండించే రైతన్నలకు నకిలీ విత్తనాలు పెద్దశాపంగా మారింది…

1 min read

AAB NEWS : హైదరాబాద్ ఎంతో కష్టించి పంట పండించే రైతన్నలకు నకిలీ విత్తనాలు పెద్దశాపంగా మారింది. నకిలీ విత్తనాలను రైతులకు సరఫరా చేసే కంపెనీలపై ఉక్కుపాదం మోపుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాలు సరఫరాచేసే కంపెనీలు పట్టు బడితే వారి పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్పారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1966లో రూపొందించిన కేంద్ర ప్రభుత్వ విత్తన విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయని అన్నారు.

విత్తన చట్టాల బలోపేతానికి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.దేశంలో నకిలీ విత్తన తయారీ దారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనిపేర్కొన్నారు. ప్రధానంగా పత్తి, మిరప నకిలీ విత్తనాపై నజర్ పెట్టినట్టు తెలిపారు.ఇప్పటికే ఈ సీజన్లో 177 కేసులు నమోదుచేసి 276 మందిని అరెస్ట్ చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తద్వారా 3468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు. విత్తనాల లైసెన్సింగ్ విధానం పారదర్శక్ంగా అమలుచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 333 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.