ఎమ్మెల్యే కి చుక్కెదురు…
1 min read
AAB NEWS : హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చుక్కెదురైంది. భారత్ బంద్‌కు టీఆర్ఎస్ అధిష్టానం మద్దతు పలికింది. దీంతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పార్టీ శ్రేణులు నియోజకవర్గ పరిధిలోని ఉషా ముళ్లపూడి కమాన్ వద్ద బంద్‌లో పాల్గొన్నారు. ఇన్నాళ్లూ కనపడని రైతుల కష్టాలు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అని ఎమ్మెల్యే గాంధీని ఓ మహిళతో పాటు స్థానికులు నిలదీశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా బారికేడ్లు పెట్టి రహదారులు మూసివేయడమేంటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడి చేశారు.
26 Total Views, 2 Views Today