కిడ్నీలో 55 రాళ్లు…
1 min read
AABNEWS : హైదరాబాద్: 60 ఏళ్ల వృద్ధురాలి మూత్రపిండాల్లో ఏకంగా 55 రాళ్లను వెలికి తీశారు నగరానికి చెందిన అవేర్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు. అడ్వాన్స్డ్ ఎండోస్కొపీ, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా విజయవంతంగా తొలగించారు. ఇంత పెద్ద మొత్తంలో మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం అత్యంత అరుదైన విషయని వైద్యులు అంటున్నారు. దీనివల్ల శస్త్రచికిత్సకు ముందు రోగికి భరించలేనంత తీవ్రమైన నొప్పి కలిగిందని తెలిపారు. అవేర్ గ్లోబల్ ఆసుపత్రుల సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డాక్టర్ పి. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ నవీన్ కుమార్తో పాటు యూరాలజీ కన్సల్టెంటు డాక్టర్ మన్నే వేణు బృందం పాల్గొన్నారు. శస్త్రచికిత్స తర్వాత రోగిని 48 గంటల పాటు వైద్యుల పరిశీలనలోనే ఉంచామని, తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. ఎప్పటికప్పుడు రోగి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు
20 Total Views, 2 Views Today