September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తన కలను వదులుకున్నా రియల్ హీరో…

1 min read

AABNEWS : ఓ కార్పొరేట్ సంస్థలో దోసపాటి రాము హెచ్​ఆర్​గా పని చేస్తున్నారు. లాక్​డౌన్ సమయంలో పేదలు, అవసరార్థుల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు. 24×7 గంటలు పని చేసేలా రైస్ ఏటీఎం ఏర్పాటు చేశారు. సాయం కోసం ఎవరు వచ్చినా నయాపైసా తీసుకోకుండా ఉచితంగా బి​య్యం, సరుకులను ఇస్తున్నారు. రోజుకు ఎంత మంది వచ్చినా అందరికీ సాయం చేస్తున్నారు. భాగ్యనగరంలోని ఎల్​బీ నగర్ రాక్​టౌన్ కాలనీలో రాము ఈ రైస్ ఏటీఎం ఏర్పాటు చేశారు. ఈ రైస్ ఏటీఎం ప్రారంభించి ఇప్పటికి దాదాపుగా 258 రోజులు పూర్తయ్యాయి. ఏ ఒక్క రోజు కూడా బియ్యం, సరుకుల పంపిణీ ఆపలేదు. అవసరార్థులకు అందిస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పటికే దాదాపు 26వేల మంది ఈ రైస్ ఏటీఎంల ద్వారా కడుపు నింపారు. ఈ సాయం చేసేందుకు దోసపాటి రాము ఇప్పటికే సొంతంగా రూ.52లక్షలను ఖర్చు చేశారు. ప్రావిడెంట్ ఫండ్​లో కొంత మొత్తాన్ని డ్రా చేసుకొని, క్రెడిట్ కార్డులను పూర్తిగా వాడుతూ అవసరార్థుల ఆకలి తీరుస్తున్నారు. 2006లో యాక్సిండెట్​కు గురై కోలుకున్న తర్వాత ఇక జీవితంలో ప్రజాసేవ చేయాలని రాము అనుకున్నారు. తన మొదటి కొడుకు పుట్టే ఐదు నెలల ముందు నుంచే ఆయన సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక లాక్​డౌన్ సమయం నుంచి ఉన్న డబ్బునంతా ఖర్చు చేస్తూ సాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం తన భార్య పూర్తి మద్దతుగా నిలుస్తోందని రాము చెప్పారు.

 354 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.