తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం’’- షర్మిల..
1 min read
AABNEWS : హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల లోటస్ పాండ్ లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనం తర్వాత అభిమానులను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఇప్పుడు తెలంగాణ లో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు.? తెలంగాణలో వైఎస్సార్ లేని లోటు ఉందని భావిస్తున్నాను.. తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకొస్తాను. మిగిలిన జిల్లా నేతల తోనూ మాట్లాడుతాను. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తాను’’ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
304 Total Views, 7 Views Today