September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి…

1 min read

AABNEWS : హైదరాబాద్ మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.మహిళల భాగస్వామ్యంతోనే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలం. భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సిఎస్ఐఆర్-నీరి (సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – నేషనల్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ల సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశం ‘భారత మహిళ ఎంటర్ ప్రెన్యూర్స్, సైంటిస్ట్ల కాంక్లేవ్’ గా నిర్వహించారు. ఆత్మ నిర్భర్ భారత్ లో మహిళల పాత్ర’ అ న్న అంశంపై డా. తమిళిసై మాట్లాడుతూ మహిళలకు మరిన్ని ప్రోత్సాహకాలు, ఫండింగ్, వసతుల కల్పన ద్వారా వారిని ఎంటర్ ప్రెన్యూర్స్ గా ప్రోత్సహించాలన్నారు. భారతదేశంలో దాదాపు 70 శాతం మంది మహిళలు ఆదాయం వచ్చే పనులకు దూరంగా ఉన్నారు. వీరంతా ఆర్ధికపరమైన వర్క్ ఫోర్స్ గా మారితే దేశం దాదాపు 30 శాతం అధిరంగా ఆర్ధికంగా బలోపేతమౌతుందని గవర్నర్ వివరించారు. మహిళలు ఔత్సాహికులుగా ఎదిగితే మహిళల కోసం అనేక ఉద్యోగాల కల్పన చేసి వారి ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడతారు.

 102 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.