పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా…
1 min read
AAB NEWS : హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. రేపు జరుగాల్సిన పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదాపడ్డాయి. రేపటి పరీక్షలను ఈ నెల 23న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 9 నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. భారత్ బంద్ కారణంగా పాలిటెక్నిక్ పరీక్షలేగాక ఓయూ, జేఎన్టీయూ యూనివర్సిటీల పరిధిలో కూడా రేపు జరుగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి.
36 Total Views, 2 Views Today