February 27, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రధానికి లేఖ సీఎం కేసీఆర్…

1 min read

AAB NEWS : హైదరాబాద్: పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి రేపు భూమి పూజ చేయనున్న నేపథ్యంలో అభినందనలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుండడం భారత సార్వభౌమత్వానికి గర్వకారణమని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం విషయంలో చాలా కాలంగా జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతమున్న పార్లమెంటు, కేంద్ర సచివాలయ భవనాలు ప్రభుత్వ పనులకు పూర్తిస్థాయిలో సరిపోవడం లేదని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి కావాలని అన్నారు.

 18 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.