AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రియుడు ఆత్మహత్య…

1 min read

AABNEWS : హైదరాబాద్: ప్రియురాలి కోసం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. వంశీకృష్ణ అనే యువకుడు ప్రేమించిన యువతి కోసం అల్వాల్‌లోని భూదేవినగర్‌ రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వంశీకృష్ణ, యువతి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఈ పరిచయం కొద్ది రోజుల్లోనే స్నేహంగా మారింది. వంశీకృష్ణ ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ప్రేమకు గుర్తుగా వంశీకృష్ణ తన ఛాతిపై ప్రియురాలి చిత్రాన్ని ముద్రించుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఎడబాటును వంశీకృష్ణ తట్టుకోలేక మనస్ధాపానికి గురయ్యాడు. ప్రియురాలు దూరం కావడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. వారి మధ్య జరిగిన గొడవ గురించి తన స్నేహితులతో వంశీకృష్ణ చెప్పుకుని బోరున విలపించాడు. ఆదివారం తన స్నేహితులతో గడిపి అనంతరం చిలకలగూడకు వెళ్లాడు. డ్యూటికి పోతున్నానని ఇంట్లో చెప్పి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఫీసుకు పోతున్నాని చెప్పి.. రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా పడివున్న కొడుకును చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనను చూసిన స్థానికులు కూడా కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా.. వంశీకృష్ణ చిలకలగూడలో నివాసముంటున్నట్లు, యువతి అల్వాల్‌లో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. యువతి సికింద్రాబాద్‌లోని ఎస్ బ్యాంక్‌లో పనిచేస్తుండగా.. వంశీకృష్ణ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 126 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.