బంగ్లాదేశ్ యువతి అరెస్ట్…
1 min read
AABNEWS : బంగ్లాదేశ్యువతి నగరంలో ఓటర్ ఐడీకార్డు, ఆధార్‌కార్డు పొందడం గమనార్హం. గాంధీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై ప్రాంతానికి చెందిన రాజు శ్రీనివాసన్ (34) ఓ ఎన్జీవో సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్పరిధిలోని కవాడిగూడ తాళ్లబస్తీలో నివాసం ఉంటున్నాడు. ఇతను 2012లో బంగ్లాదేశ్‌కు చెందిన హకీ(23) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత బంగ్లాదేశ్వెళ్లి అక్కడ కొంతకాలం నివాసం ఉన్నాడు. 2017లో నగరానికి వచ్చిన ఈ దంపతులు కవాడిగూడ తాళ్లబస్తీలో నివాసం ఉంటున్నారు. హకీ అప్పటినుంచి విసిటింగ్ వీసాపై బంగ్లాదేశ్వెళ్లి వస్తోంది. అయితే ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ నగరంలోనే ఉండిపోయింది. ఫారినర్స్ రీజనల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్ గాంధీనగర్ పోలీసులకు ఈ సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం హకీని అదుపులోకి తీసుకొని విచారించగా వీసా గడువు ముగిసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెపై ఐపీసీ 420, ఫారినర్యాక్ట్ 14 ప్రకారం కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.
69 Total Views, 2 Views Today