బస్సు యాత్ర బాధ్యతంతా రాములమ్మకె…
1 min read
AABNEWS :
హైదరాబాద్: రాములమ్మ రాక తెలంగాణ బీజేపీలో కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆమె కీలకమని అధిష్ఠానం కూడా భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే విజయశాంతికి అనేక ముఖ్యమైన బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. త్వరలో బీజేపీ చేపట్టనున్న బస్సు యాత్ర బాధ్యతలన్నీ ఆమెకే అప్పగించాలని పార్టీ భావిస్తోందట. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఈ బస్సు యాత్రను నిర్వహించనుంది. ఈ యాత్ర ద్వారా ప్రజలను బీజేపీవైపు తిప్పడమే ధ్యేయంగా రాములమ్మ ముందుకెళతారని సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత బీజేపీ ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థిగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడంతో పాటు తెలంగాణకు హృదయం వంటి జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ అద్భుతమైన ఫలితాలను రాబట్టి గులాబీ దళం గుండెల్లో గుబులు రేపింది. ఈ ఊపులోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలని కమలదళం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలతో పాద యాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అంతకన్నా ముందు రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ బస్సు యాత్ర బాధ్యతంతా రాములమ్మపైనే అధిష్ఠానం ఉంచినట్లు తెలుస్తోంది..
89 Total Views, 2 Views Today