February 27, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మరో అరుదైన ఘనత సాధించిన మహా నగరం…

1 min read

AABNEWS : మరో అరుదైన ఘనత సాధించిన మహా నగరం. ప్రపంచంలోనే సీసీ కెమెరాలు ఎక్కువ వినియోగిస్తున్న పట్టణాల్లో హైదరాబాద్ప్ర పంచంలోనే రెండో స్థానం..అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను నివాసయోగ్యానికి అనువైన పట్టణంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో విషయంలోనూ భాగ్యనగరం టాప్‌ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే సీసీ కెమెరాలు ఎక్కువ వినియోగిస్తున్న పట్టణాల్లో హైదరాబాద్‌ నగరం రెండో స్థానంలో నిలిచింది. ఇక తమిళనాడు రాజధాని చెన్నై మొదటి స్థానంలో నిలవడం విశేషం. చెన్నైలో ప్రతీ చదరపు కిలోమీటర్‌కు 657 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే.. చదరపు కిలోమీటర్‌కు 480 సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం నేర పరిశోధనల్లో సీసీ కెమెరాల పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు సగం వరకు కేసులు సీసీ కెమెరాల ఆధారంగానే పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులతోపాటు, ప్రభుత్వాలు కూడా సీసీ కెమెరాల వినియోగాన్ని బాగా పెంచాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘన, నేరస్థులను పట్టుకోవడం వంటి వాటి కోసం తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో హైదరాబాద్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది.

 508 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.