మలక్ పేటలో కారు బీభత్సం…
1 min read
AABNEWS : హైదరాబాద్‌లోని మలక్ పేటలో మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న డీమార్ట్ వద్ద కారు రివర్స్ తీసుకునే క్రమంలో సమీపంలోని టీకొట్టులోకి దూసుకెళ్ళింది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బాపురాజు అనే వ్యక్తి మలక్ పేట డీమార్టులో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు మంగళవారం తన కారులో వచ్చాడు. సరుకులు తీసుకున్న తర్వాత పార్కింగ్‌లో ఉన్న తన కారును రివర్స్ తీయడానికి ప్రయత్నించగా.. ఒక్కసారిగా కారు పక్కనే ఉన్న టీకొట్టులోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ ఇంఛార్జ్‌కి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని పోలీసు దర్యాప్తు చేపట్టారు.
20 Total Views, 2 Views Today