AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మే 15 నుంచి 120 రోజుల వరకు మీరు వాట్సప్ ఉపయోగించుకోవచ్చు …

1 min read

AABNEWS : రెండు నెలల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రైవసీ పాలసీలో కాస్త మార్పులు చేసి కొత్త పాలసీని ప్రకటించింది వాట్సప్. ఈ ప్రైవసీ పాలసీని మే 15 లోపు అంగీకరించాలి. ఇప్పటికే ఈ పాలసీని అంగీకరించినవారు చేయాల్సిందేమీ లేదు. కానీ ఇంకా వాట్సప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయనివారికి మరో నెల రోజే గడువుంది. ఇప్పటికీ ప్రైవసీ పాలసీ అంగీకరించని వారికి పదేపదే రిమైండర్స్ పంపిస్తోంది వాట్సప్. 2021 మే 15 లోగా ప్రైవసీ పాలసీని అంగీకరించాలని కోరుతోంది. ఒకవేళ అప్పట్లోగా ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఏమవుతుందన్న సందేహాలు యూజర్లలో ఉన్నాయి. ఒకవేళ మీరు వాట్సప్ కొత్త నియమనిబంధనలు అంగీకరించకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆ తర్వాత 120 రోజుల పాటు మీరు వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. కానీ కొన్ని ఫీచర్స్ పనిచేయవు. మీరు నోటిఫికేషన్స్, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. కానీ వాట్సప్ నుంచి మెసేజెస్ పంపడం సాధ్యం కాదు.
మే 15 నుంచి 120 రోజుల వరకు పరిమితమైన ఫీచర్స్‌తో వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత కూా మీరు నియమనిబంధనలు అంగీకరించకపోతే వాట్సప్ మీ అకౌంట్‌ను డిలిట్ చేస్తుంది. ఆ అకౌంట్స్‌లో ఉన్న ఛాట్స్, గ్రూప్స్ అన్నీ పోతాయి. ఒకవేళ మీరు మళ్లీ అదే నెంబర్‌తో వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే అన్నీ మొదటి నుంచే ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పుడైనా మీరు మళ్లీ కొత్త ప్రైవసీ నియమనిబంధనల్ని అంగీకరించాల్సిందే. వాస్తవానికి వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని జనవరిలో ప్రకటించింది. ఫిబ్రవరి 8 లోగా ఈ పాలసీని అంగీకరించాలని కోరింది. కానీ ఆ ప్రైవసీ పాలసీ వివాదాస్పదం కావడంతో డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించి 2021 మే 15 డెడ్‌లైన్‌గా విధించింది. గతంలో ప్రైవసీ పాలసీ వివాదాస్పదం కావడంతో యూజర్లకు వివరణ కూడా ఇచ్చింది. యూజర్ల పర్సనల్ కాన్వర్జేషన్స్ తాము వినం, చదవం అని, అవి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఉంటాయని, అందులో ఎలాంటి మార్పు లేదని అని వాట్సప్ క్లారిటీ ఇచ్చింది వాట్సప్. డేటా సెక్యూరిటీ, కమ్యూనికేషన్‌కు సంబంధించిన ప్రైవసీ విషయంలో రాజీ పడట్లేదని తెలిపింది. కానీ యూజర్ల డేటాను సేకరించడంతో పాటు థర్డ్ పార్టీ సంస్థలతో షేర్చేసుకుంటామన్న నియమనిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వ్యాపారులతో ఛాట్ చేసేలా, ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకునేలా మార్పులు చేస్తున్నామని, పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు డేటా షేర్ చేస్తామని తెలిపింది.

 157 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.