AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

యూపీఏ ప్రభుత్వం కేసీఆర్‌ని ఎందుకు విచారించలేదు: బండి సంజయ్‌…

1 min read

AAB NEWS : హైదరాబాద్: బీసీలు, దళితులకు టీఆర్ఎస్‌లో గౌరవం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. కేంద్రమంత్రిగా కేసీఆర్ అవినీతికి పాల్పడితే.. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపలేదు? అని ప్రశ్నించారు. ఈనెల 13 లేదా 14న నడ్డా సమక్షంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్ని కంట్రోల్ చేయటంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి అంటే తనకు అభిమానమన్నారు. ఈటల ఇండిపెండెంట్‌గా పోటీచేయాలనటం..కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కొవిడ్‌ను కంట్రోల్ చేయలేకే మంత్రి కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

 100 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.