రైతుబంధు సాయం పంపిణీ-కేసీఆర్…
1 min read
AAB NEWS : హైదరాబాద్: తెలంగాణలో రైతులకు అందించే రైతుబంధు సాయాన్ని ఈనెల 27వ తేదీ నుంచి అందించనున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. జనవరి 7వ తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీని కోసం అవసరమైన 7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలు పెట్టి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని అన్నారు.
యాసంగి సీజన్ రైతుబంధు సహాయం (రెండో విడత) పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానం పై చర్చించి కార్యాచరణ ఖరారు చేశారు.
24 Total Views, 2 Views Today