రోడ్డుప్రమాదంలో వెలుగులోకి కీలక అంశాలు…
1 min read
AABNEWS : హైదరాబాద్: గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదుగురు కలిసి ఎక్కడికి వెళ్లారన్నదానిపై మిస్టరీ కొనసాగుతోంది. యువకులు ఎక్కడెక్కడ తిరిగారన్నదానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ డీసీపీ తెలిపారు. గ్రీన్ సిగ్నల్ నుంచి వస్తున్న టిప్పర్‌ను కారు ఢీకొట్టిందని, ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతిచెందారని డీసీపీ చెప్పారు. హాస్టల్‌కి వెళ్లాల్సిన వారు.. విప్రో వైపు ఎందుకు వచ్చారే అనుమానంతో విచారణ చేపడుతున్నామని తెలిపారు. కారులో కొన్ని సీసాలు లభ్యమయ్యాయని, దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ డీసీపీ పేర్కొన్నారు.
గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. గ్రీన్ సిగ్నల్ పడిన మరోవైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్, కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురూ మృతిచెందారు. మృతులంతా ఏపీ యువకులే. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కాట్రగడ్డ సంతోష్(25), తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మనోహర్(23) నెల్లూరుకు చెందిన కొల్లూరు పవన్ కుమార్(24), నాగిశెట్టి రోషన్(23), విజయవాడకు చెందిన పప్పు భరద్వాజ్(20).. మాదాపూర్ అయ్యప్పసొసైటీలోని ఓ హాస్టల్లో ఉంటున్నారు.
18 Total Views, 2 Views Today