AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వింత రెండు చోట్ల ఓటు వేశారు, క్లారిటీ ఇచ్చిన RDO…

1 min read

AAB NEWS : ఆమె ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయండి.. ఎస్ఈసీకి ఇందిరా శోభన్ ఫిర్యాదు

హైదరాబాద్, నిజామాబాద్ జిల్లా పోతంగల్ లో తన ఓటును వదులుకోకుండానే జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఓటు వేశారని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అని, తక్ష ణమే ఆమె ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కోరారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదును పంపారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పొతంగల్ పోలింగ్ బూత్ నుంచి ఎమ్మెల్సీ కవిత ఓటు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఆధారాలను సమర్పించారు.

పొతం గల్ ఓటరు జాబితాలో తన ఓటును తొలగించుకోకుండానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడమేనని ఇందిర విమర్శించారు

నిబంధనల ప్రకారమే ఓటు బదలాయింపు: టీఆర్ఎస్

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్ గ్రామ పరిధిలో తనకు, తన భర్తకు ఉన్న ఓటు హక్కును బైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి మార్చాలని ఎమ్మెల్సీ కవిత అక్కడి ఈఆర్ వోకు దరఖాస్తు చేసుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి, నవంబరు 28న ఓటు బదిలీ ప్రక్రియ పూర్తయిందని, దీంతో కవిత హైదరాబాద్ లో ఓటు వేశారని పార్టీ నేతలు తెలిపారు. కాగా, తమకు జైరాతాబాద్ ఈఆర్ వో నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పొతంగల్ ఉన్న కవిత ఓటును ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించామని… నేషనల్ సర్వీసు ఓటర్ల లిస్టులో వారం రోజుల తర్వాత తొలగిస్తారని బోధన్ ఆర్టీవో రాజేశ్వర్ వెల్లడించారు

 120 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.