AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సంక్రాంతికి స్పెషల్ రెడీ…

1 min read

AABNEWS : రాష్ట్రంలో సంక్రాంతి రద్దీ కోసం ఆర్టీసీ, రైల్వే మాదిరిగా విమానాయాన సంస్థలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం స్పెషల్ ఫ్లైట్ సర్వీసలు నడపాలని స్పైజ్ జెట్ నిర్ణయించింది. గన్నవరం – హైదరాబాద్ మధ్య ఈ నెల 10 నుంచి 31 మధ్య ప్రతిరోజు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటింది. అలాగే ఈనెల 11-28 మధ్య మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. పదో తేదీ నుంచి 31 వరకు ప్రతి రోజు సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లో విమానం బయలుదేరి 5.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అదే విమానం తిరిగి 6 గంటలకు బయలుదేరి రాత్రి 7.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.అలాగే 11వ తేదీ నుంచి 28 వరకు మరో కొత్త సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫ్లైట్ విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 16 నుంచి 30 వరకు మరో విమాన సర్వీసు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నట్లు స్పైజ్ జెట్ వివరించింది. ఈ విమానం మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో బయలుదేరి 3.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని స్పైస్‌జెట్ తెలిపింది.సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు రైల్వేతో పాటు ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సులు నడిపేందుకు సిద్ధమైన ఏపీఎస్ ఆర్టీసీ..ఛార్జీల బాదుడుకి కూడా రంగం సిద్ధం చేసింది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు లక్షలాది మంది వచ్చే అవకాశముండటంతో ఏపీఎస్‌ ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు నడపనుంది. 2021 జనవరి 8వ తేదీ నుంచి 13 వరకూ పొరుగు రాష్ట్రాలు, నగరాల నుంచి రాష్ట్రానికి ప్రనత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 1251 బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ నడపనుంది. ఇక బెంగళూరు నుంచి 433, చెన్నై నుండి 133 బస్సులు అందుబాటులో ఉంచింది. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి విజయవాడకు 201, విశాఖకు 551 బస్సులు నడపుతారు.

 650 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.