హిమాయత్ నగర్ లో మహిళ దారుణ హత్య…
1 min read
AABNEWS : మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ గ్రామ సమీపంలోని వెంచర్ల వద్ద మహిళ దారుణ హత్యకు గురైంది. అతి కిరతకంగా రాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. వెంకటప్ప, లక్ష్మి దంపతులు 15 రోజుల క్రితం ఉపాధి కోసం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జంగం నుంచి మొయినాబాద్‌కు వచ్చారు. వీరికి రెండు సంవత్సరాల పాప ఉంది. ఏం జరిగిందో ఏమో కానీ లక్ష్మి దారుణ మత్యకు గురైంది. మొయినాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
38 Total Views, 2 Views Today