AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

హైదరాబాద్లో మద్యం బంద్…

1 min read

AAB NEWS : హైదరాబాద్ పరిధిలో నేటి నుంచి మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. నగరంలో మున్సిపాల్ ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం సాయంత్రం (డిసెంబర్1వ తేదీ) ఆరు గంటల వరకు హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నగర పరిధిలో నేటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనుండడంతో నిన్నటి నుంచే నగరంలో మద్యం ప్రియులు భారీగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే, నగరంలో ఆబ్కారీ అధికారులు ఎవరు పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎవరైనా అలా చేసినా, విక్రయించినా ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి మద్యం సరఫరా కాకుండా చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దివారం సాయంత్రం (నవంబర్ 29న) 6 గంటల నుంచి డిసెంబర్‌ 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను జీహెచ్ఎంసీ పరిధిలో నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆయా పార్టీల శ్రేణులతో పాటు మందుబాబులు సైతం ముందుగానే మద్యం విక్రయించేందుకు క్యూ కడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది.

 202 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.