హైదరాబాద్లో భట్టి విక్రమార్క…
1 min read
AAB NEWS : హైదరాబాద్:
ఎన్నికల వేళ అసలు హైదరాబాద్లో ఏం జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నంచారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేస్తానని అక్బరుద్దీన్ అనడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతల మాటలు దారుణంగా ఉన్నాయన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన చేసే వ్యాఖ్యలు ఇవేనా అని విమర్శించారు. ఓ పక్క కరోనా విజృంభిస్తున్న నాయకులు లెక్కచేయడం లేదన్నారు. కరోనా,వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ మజ్లిస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయన్నారు. ప్రజల రక్షణను గాలికొదిలేశారన్నారు.
బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు నగరాన్ని అభివృద్ధి చేయకుండా పబ్బం గడిపారన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని, మళ్లీ కొత్త హామీలతో ప్రజలను టీఆర్ఎస్ నాయకులు మభ్యపెడుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ ఉండి కూడా వరదల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ మూడూ ఒక్కటేనని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఈ మూడు పార్టీలను చిత్తుగా ఓడించాలని ఆయన జోస్యం చెప్పారు.
20 Total Views, 2 Views Today