AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

18 సంవత్సరాలు నిండిన దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వాక్సిన్…

1 min read

AAB NEWS : వికారాబాద్ జిల్లా దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచిత వాక్సిన్ ఇవ్వడం హర్షణీయం
బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి .18 సంవత్సరాలు నిండిన దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వాక్సిన్ ఇవ్వడాన్ని అభినందిస్తూ స్థానిక పరిగి పట్టణం మరియు సుల్తాన్ పూర్, తొండ పల్లి తదితర గ్రామాల్లో బీజేపీ నాయకులు మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి గా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి మాట్లాడుతూ వాక్సినేషన్ ప్రక్రియలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 18 సంవత్సరాలు నిండిన దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వాక్సిన్ ఈనెల 21 వ తేదీ నుండి ఇవ్వనున్నట్లు ప్రకటించడం నిజంగా హర్షణీయం అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వమే అందించనుంది అన్నారు. దేశీయంగా ఉన్న వాక్సిన్ లతో పాటు విదేశీ టీకాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. అదే విధంగా ప్రజలంతా లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బదులు పడున్నారు. ఈ పరిస్థితుల నుండి బయటపడే వరకు కొంత సమయం పడుతుంది అన్న ఉద్దేశ్యం తో దీపావళి వరకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ అందించనుంది అన్నారు. నరేంద్రమోదీ గారు తీసుకున్న ఈ రెండు నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలుచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్, జిల్లా కార్యదర్శి హరికృష్ణ, సీనియర్ నాయకులు పెంటయ్య, మండల అధ్యక్షులు ఆంజనేయులు, నాయకులు బాలకృష్ణ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటేష్, శ్రీశైలం, వార్ల ఆంజనేయులు, ఎర్రగడ్డ పల్లి రమేష్, తొండపల్లి అనంతయ్య, నగేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

 105 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.