200 రకాల మొక్కల పెంపకం…
1 min read
AABNEWS : టేకులపల్లికి చెందిన మౌలానా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. పదేళ్ల క్రితం తాను విధులు నిర్వర్తించిన పాఠశాలతోపాటుగా, తన ఇంటి ఆవరణలో మొక్కలు పెంచాలని నిర్ణయించుకుని అనుకున్నదే తడవుగా ప్రయత్నాన్ని ప్రారంభించారు. ప్రత్యేకంగా మొక్కలు కొనుగోలు కోసం కడియం, విజయవాడ, తిరువూరుతోపాటుగా స్థానిక ప్రధాన నర్సరీలకు వెళ్లి కొనుగోలు చేసేవారు. ఏ పని మీద అయినా సరే పట్టణాలకు వెళ్తే ఖాళీగా రాకుండా ఏదో ఒక మొక్కను వెంట తీసుకొచ్చేవాడినని మౌలానా చెబుతున్నారు. మొక్కమొక్కను పొగు చేసి వందల రకాలు తన ఇంటి ఆవరణలో నాటారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు వీటి సంరక్షణకు రోజుకు రెండు గంటలు కేటాయించేవాడినని, ప్రస్తుతం అధిక సమయం కేటాయిస్తున్నానని ఆయన చెబుతున్నారు. 200 రకాల మొక్కలను పెంచుతున్నారు. పండ్లజాతి మొక్కల్లో ఆపిల్, తైవాన్జామ, ద్రాక్ష, తీపి నారింజ, పనస, సపోటా, దానిమ్మ, నల్లజామ, తెల్లజామ, ఉసిరి, మామిడి, బొప్పాయి వంటి వి ఉన్నాయి. పూల జాతికి సంబంధించి బెంగళూరు సంపంగి, సాధారణ సంపంగి, గులాబీ, మందార, తామరలు, గన్నేరు, మల్లె, పుష్పగుచ్ఛాల్లో అమర్చే పూలు, నైట్క్వీన్, నందివర్ధనం, నూరువరాలు, కోల్కతా ఆకు, సాదా ఆకు ఉన్నాయి. వీటితోపాటుగా ఆర్కెరియా, సైకస్, టెంపుల్, క్రోటాన్స్, ఆర్కేఫామ్స్ 12రకాలు వీటితోపాటు ఇండోర్ ప్లాంట్స్ పెంచుతున్నాం. కొ త్త మొక్క కనిపిస్తే అది నా ఇంటి ఆవరణలో ఉండాల్సిందే. కేవలం మొక్కల కొనుగోలు కోసం రాజమండ్రి, కడియం వరకు వెళ్లేవాడిని. పెంపకంలో ఉండే ఆ ఆనందమే వేరు. పండ్ల జాతి వి ప్రస్తుతం ఫలాలు ఇస్తున్నాయి.
90 Total Views, 2 Views Today