
AABNEWS : దేశంలో ఉవ్వెత్తున ఎగసిన కరోనా డిసెంబరు నాటికి మెరుగుపడిన పరిస్థితులు దేశంలో ఉవ్వెత్తున ఎగసిన కరోనా అల క్రమంగా నేలను తాకుతోంది. జనవరి నుంచి దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వస్తున్న మహమ్మారి కబంధ హస్తాల బిగి ఇప్పుడిప్పుడే సడలుతున్నట్లు కనిపిస్తోంది. జనవరిలో ఒకటితో మొదలైన మహమ్మారి ప్రభావం డిసెంబరు ముగిసేనాటికి కోటిని మించిపోయింది. మార్చి నుంచి మొదలైన మరణాలు సంవత్సరం చివరి నాటికి 1.48 లక్షలకు చేరిపోయాయి. దినదిన ప్రవర్ధమానమైనట్లుగా కరోనా సెప్టెంబరు వరకు విజృంభించింది. అప్పటివరకు ప్రతి నెలా కేసులు, మరణాలు పెరుగుతూపోయాయి. ఆ తర్వాతి నుంచి తీవ్రత తగ్గుముఖం పడుతూ వస్తోంది. కొవిడ్ దెబ్బకు ఈ ఏడాది విద్యా సంస్థలన్నీ మూతపడిపోయాయి. జల, వాయు, రైలు, రోడ్డు రవాణా మార్గాలు ఇంకా పూర్తిస్థాయిలో తెరచుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. దేశం మొత్తం వ్యాక్సిన్ కోసం ఆశతో ఎదురుచూస్తూ ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తోంది. వైరస్ తొలినాళ్లలో పెద్దగా పట్టించుకోని ప్రజలు మే నుంచి దేశంలో కేసులు, మరణాలు పెరిగిపోవడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అక్టోబరు నుంచి తగ్గుముఖం పట్టడం మొదలవడంతో ఇప్పుడు దానికి అలవాటు పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. జనవరి 31 నాటికి మరణాల రేటు 1.44%కి చేరడం కొంత ఊరటనిస్తోంది.
108 Total Views, 2 Views Today