రోడ్డు పై ఇష్టానుసారంగా ఆటోలు నిలిపివే…
1 min read
AABNEWS : గన్నవరం పోలీసు స్టేషన్ వద్ద ఆటో , టాటా మ్యాజిక్ డ్రైవర్లు సిఐ కోమాకుల శివాజీ కౌన్సెలింగ్ ఇచ్చారు. గాంధీ బోమ్మకూడలి , వేంకటేశ్వర ధియేటర్ కూడలి ఇలా పలు కూడళ్ల వద్ద రోడ్డు పై ఆటోలు అపేయటం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించారు.. రోడ్డు పై ఇష్టానుసారంగా క్రమ పద్దతి లేకుండా ఆటోలు నిలిపివేస్తే కేసులు నమోదు చేయటమే కాక వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రయాణీకులు ఎక్కుంచుకోవాలని ఆత్రుతతో పోటీపడి ఆటోలు అడ్డదిడ్డంగా నిలపవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ పురుషోత్తం పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
54 Total Views, 4 Views Today