September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రసాభాసగా రామన్నగూడెం గ్రామ సభ…

1 min read

AABNEWS : రసాభాసగా రామన్నగూడెం గ్రామ సభ మన రామన్నగూడెం గ్రామంలో జరిగిన గ్రామసభను గ్రామ ప్రజలంతా బహిష్కరించినారు *ఈ రోజు గ్రామసభలో సంగ్రామంలో సభలో ఒక్కక్కరు ఒక్కక్క ప్రశ్నల మీద ఆరోపణలు చేయడం జరిగింది అవి 1.శ్మశానవాటికకు విద్యుత్ లైన్ గురించి 100044/- ఒక లక్ష నలభై నాలుగు రూపాయలు అక్షరాల డి.డి కట్టినారు ఇట్టి విషయంపై సుంకరి శ్రీనివాస్ ఆరోపణ చేశారు 2.గ్రామంలో వేరు వేరు బజార్లలో మొరం తోలించామని రూ₹=100050 బిల్లును ఇష్టానుసారంగా పెట్టుకున్నారు దీనిపై సూర ఎల్లయ్య ఆరోపణలు చేసినారు ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు రూ=200/-చొప్పున ఇచ్చి రూ=500 ల చొప్పున ఇచ్చినట్లు బిల్లు పెట్టుకున్నారు 3.గ్రామంలో గల మురికి కాలువల పూడిక తీతకు రూ=18,000-00/- ఇచ్చి రూ=70,000-00 బిల్లు పెట్టుకున్నారు 4.డ్రైనేజి బిల్లలు(పై మూతలకు) రూ=61,000-00 బిల్లును పెట్టుకుని డ్రా చేసుకున్నారు 5.గ్రామంలో వీధి లైట్స్ పెట్టడానికి రూ=67,465-00 బిల్లును పెట్టుకున్నారు,గత నెలలో ఇదే వీధి లైట్స్ పెట్టడానికి రూ=15,900-00బిల్లును పెట్టుకున్నారు 6.పల్లె ప్రగతి కార్యక్రమంలో అంతర్గత రోడ్స్ గురించి JCB,డోజర్ పేరిట రూ =47,000-00,డోజర్ కు రూ=66,000-00 బతుకమ్మ ఘాట్ లో గ్రావెలింగ్ కొరకు రూ=47,134-00 బిల్లును పెట్టుకున్నారు ,కానీ ఇట్టి గ్రావెలింగకు ఒక దాత పోయించినారు ,దీనిని కూడా వీరే పోయించినట్లు బిల్లు పెట్టుకున్నారు 7.నూతన గ్రామపంచాయతీ భవణం నిర్మాణం మంజూరయ్యి అసంపూర్తిగా నిర్మాణం చేసి, పూర్తి చేసినట్లు బిల్లు రూ=16,00,000-00 కాజేసినారు ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెల్లడం జరిగింది అయినా ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు #ఇట్టి విషయమై ఆలకుంట్ల సాయిలు, గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ,పైవిషయాలన్నింటి పైన జిల్లా కలెక్టర్ గారికి ,డి.పి.ఓ,మరియు యం.పి.డి.ఓ గార్లకు కాంప్లెంట్ చేసినా,ఈ రోజు వరకు ఎలాంటి విచారణ కానీ, చర్యలు కానీ తీసుకోలేదు
#ఇట్టి గ్రామ సభలో గ్రామ సర్పంచ్ కు బదులు ఆమె భర్త అగు కాశమళ్ళ సాయిలు ప్రజల పైన దౌర్జన్యంగా,అహంకారపూరితంగా ధుర్బషలాడినాడు# ఇట్టి వారిపై అథికారంలంతా గమనించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల కోరుకుంటున్నారు , ఈ సభలో ఆలకుంట్ల సాయిలు, చీకటి జగదీష్, కాశమళ్ళ అశోక్, సూర అనిల్, తవిసి ఉపేందర్, సుంకరి శ్రీను,సూర ఎల్లయ్య మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజల పాల్గొన్నారు

 602 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.