AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

BSP పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గా తిక్క ఉదయ్ గారు

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమీక్ష సమావేశానికి తేదీ 01/07/2021 రోజున ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర BSP పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ మంద ప్రభాకర్ సార్ గారు నాకు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కో-ఆర్డినేటర్ పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది . రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మంద ప్రభాకర్ సార్ గారికి ప్రత్యేకమైన జై భీమ్ లతో ధన్యవాదాలు తెలుపుతూ… జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో BSP పార్టీ ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలుపుతున్నాము. ఈ ఒక్క సమావేశాన్ని ఉద్దేశించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కో-ఆర్డినేటర్ తిక్క ఉదయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ యొక్క సమావేశానికి కొన్ని కుల సంఘాల లో పనిచేసిన జిల్లా నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం తెలుసుకొని BSP పార్టీ లో పని చేయడానికి ముందుకు వచ్చిన నాయకులందరికీ ప్రత్యేకమైన జై భీమ్ లతో స్వాగతం పలుకుతూ….
కుల సంఘాలను పాలకులు వాంఛలతో కొనుగోలు చేసి బహుజన రాజ్యాధికారం రాకుండా చేయడం లో పాల్గొని విజయం సాధిస్తున్నారు…. కుల సంఘాల వలన బహుజన సమాజానికి నష్టం తప్ప ఫలితం లేదని బహుజన లైన (BC SC ST Minorities) లు గమనించాలని పేర్కొన్నారు…..
మహనీయులైన జ్యోతిరావు పూలే,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కాన్షీరామ్ గార్ల ఆలోచన విధానం ఆశయాలను సాధించాలంటే రాజ్యాధికారం ద్వారానే బహుజనుల జీవితాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి సామాజిక మార్పుతో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు పరచగల ఏకైక జాతీయ పార్టీ (BSP)బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పడం జరిగింది….ఈ యొక్క సమావేశంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా మరియు అసెంబ్లీ కమిటీ నాయకులు మరియు మండల, గ్రామాల ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

 381 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.