AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

CM గారి ఆలోచనా విధానాలు దేశానికి అవసరమని…

1 min read

AABNEWS : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనా విధానాలు దేశానికి అవసరమని ఎమ్మెల్యే సింహద్రి పేర్కొన్నారు… ఈ నెల 25 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నివేశన స్థలాలు ఇవ్వనున్న నేపద్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతూ నియోజవర్గం ప్రధాన కేంద్రం అవనిగడ్డ వై ఎస్ ఆర్ సి పి కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి,ఘనంగా నివాళులర్పించిన.అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహద్రి మాట్లాడుతూ ఈ నెల 25 తేదీన 30 లక్షలు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని,రాష్ట్ర అభివృద్ధి,పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో,మంచి ఆలోచనా విధానాలతో పారదర్శకంగా ముందుకు సాగుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.ప్రతిపక్ష పార్టీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు చేయాలే గాని దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.నివేశన స్థలాల పంపిణీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్ గారికి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని ఈ సందర్భంగా సింహాద్రి కోరారు. కార్యక్రమాలలో భాగంగా బుధవారం లబ్ధిదారులతో ర్యాలీ,గురువారం లబ్ధిదారులకు అధికారులు కేటాయించిన స్థలాల ప్లాట్ల వివరాలు తెలియజేస్తారని సింహాద్రి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ,మండల గ్రామ స్థాయి నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 44 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.